Kannappa Movie : ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌తో పాటు నయనతార కూడా..? మంచు విష్ణు గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నాడుగా..

కన్నప్ప సినిమాలో సీనియర్ నటి మధుబాల కూడా నటిస్తుంది. ఇటీవల మధుబాల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Kannappa Movie Update :  ఎప్పట్నుంచో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు అని భక్త కన్నప్ప ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. ఇటీవల ఈ సినిమాని అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon) నటిస్తుంది అని ప్రకటించినా ఇటీవల ఆ సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ తప్పుకున్నట్టు విష్ణు స్వయంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు, ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

Also Read : Vijay Devarakonda : VD12 అప్డేట్ త్వరలో.. గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమా శరవేగంగా..

కన్నప్ప సినిమాలో సీనియర్ నటి మధుబాల కూడా నటిస్తుంది. ఇటీవల మధుబాల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్, నయనతార, మంచు విష్ణు గారితో కలిసి నటిస్తున్నాను అని తెలిపింది. దీంతో ఈ సినిమాలో నయనతార ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. విష్ణు ఈ సినిమాని చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేశాడు అని అనుకుంటున్నారు. గతంలోనే మంచు విష్ణు కన్నప్ప సినిమాలో చాలా మంది సౌత్ స్టార్స్ ఉంటారని చెప్పాడు. విష్ణు అనౌన్స్ చేయకపోయినా ఇప్పుడు అనుకోకుండా నయనతార పేరు బయటకి వచ్చింది. ఇంకా ఎంతమంది స్టార్స్ ఉన్నారో చూడాలి మరి. ఇక ప్రభాస్, నయనతార గతంలో యోగి సినిమాలో కలిసి నటించారు. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి సీన్స్ ఉన్నాయా లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు