Manchu Vishnu Kannappa Movie Release Date Announced
Kannappa : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ని తెరకెక్కిస్తున్నాడు. మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ తో మోహన్ బాబు నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన పాత్రల పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Naga Chaitanya – Sobhita : తాతగారి విగ్రహం ముందు మా పెళ్లి.. శోభితని పొగుడుతూ పెళ్లిపై నాగచైతన్య వ్యాఖ్యలు..
డిసెంబర్ లో రిలీజవ్వల్సిన ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాని వాయిదా వేస్తూ నేడు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కన్నప్ప సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు మంచు విష్ణు నేడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. న్యూజిలాండ్ అడవులతో పాటు, రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు.
కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ కన్నప్ప సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరి కన్నప్ప సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.