Naga Chaitanya – Sobhita : తాతగారి విగ్రహం ముందు మా పెళ్లి.. శోభితని పొగుడుతూ పెళ్లిపై నాగచైతన్య వ్యాఖ్యలు..

నాగచైతన్య తమ పెళ్లి గురించి, శోభిత గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

Naga Chaitanya – Sobhita : తాతగారి విగ్రహం ముందు మా పెళ్లి.. శోభితని పొగుడుతూ పెళ్లిపై నాగచైతన్య వ్యాఖ్యలు..

Naga Chaitanya Interesting Comments on Sobhita and Their Marriage goes Viral

Updated On : November 25, 2024 / 9:31 AM IST

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య త్వరలో శోభితని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. డిసెంబర్ 4 న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. శోభిత పెళ్ళికి ముందే అక్కినేని ఫ్యామిలిలో జరిగే ఈవెంట్స్ కు హాజరవుతుంది.

తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలను నిర్వహించగా అక్కినేని ఫ్యామిలీతో పాటు శోభిత కూడా హాజరైంది. నాగచైతన్యతో శోభిత కనిపించి కనువిందు చేసింది. అక్కడ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నాగచైతన్య తమ పెళ్లి గురించి, శోభిత గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Rashmika Mandanna : మొన్న విజయ్.. ఇప్పుడు రష్మిక క్లారిటీ.. పెళ్లిపై రష్మిక సమాధానం.. పడీ పడీ నవ్విన శ్రీలీల..

నాగచైతన్య మాట్లాడుతూ.. మా పెళ్లి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా, సంప్రదాయంగా జరగనుంది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. అన్ని మేము ఇద్దరం కలిసే నిర్ణయిస్తున్నాము. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే మా పెళ్లి జరగనుంది. ఆ స్టూడియోకు మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. స్టూడియోలో ఉన్న మా తాతయ్య గారి విగ్రహం ముందే మా పెళ్లి జరగనుంది. రెండు కుటుంబాలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.

ఇక శోభిత గురించి మాట్లాడుతూ.. ఆమెతో కొత్త జీవితం ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాను. తనతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. తను నన్ను బాగా అర్ధం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన ఒక ఖాళీని తను నింపుతుందని భావిస్తున్నాను అని అన్నాడు చైతు. ఇలా శోభిత గురించి చైతన్య పొగడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.