Kannappa Official Teaser-2
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నటి కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.
ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర బృందం.. ఈ చిత్రంలో కీలక నటీనటుల ఫస్ట్ లుక్స్‌లను విడుదల చేస్తూ వచ్చింది. వాటి అన్నింటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఓ టీజర్‌ను విడుదల చేయగా తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది.
Samantha : సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
విష్ణు నటన అదరిపోయింది. శివుడిగా అక్షయ్ కుమార్ పాత్రను, అలాగే పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ పాత్రతో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్ సహా పలువురి పాత్రలను చూపించారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా టీజర్ చాలా బాగుంది.