Samantha : సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
సమంత.. తనకో లవ్‌స్టోరీ కావాలంటోంది.

Samantha Ruth Prabhu On Her Return To Films
తనకో లవ్‌స్టోరీ కావాలంటున్న సామ్. సౌత్ ఇండస్ట్రీని పట్టించుకోకుండా కొద్దిరోజులుగా హిందీ వెబ్‌సిరీస్‌లను మాత్రం ఎంచుకుంటున్న సమంత.. టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోతోంది. ఇంతకీ సమంత రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఏంటి.. డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం..
విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి.. కారణం ఏదైనా సౌత్ ఇండస్ట్రీకి సామ్ దూరం అయి చాలారోజులు అవుతోంది. విజయ్‌దేవరకొండ ఖుషీ మూవీ తర్వాత.. తెలుగులో సమంత కనిపించిందే లేదు. ఒక్క సినిమా కూడా చేయలేదు. సిటాడెల్‌లాంటి వెబ్ సిరీస్‌లు మాత్రమే చేసింది.
Kiara Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా.. ‘అతి త్వరలో మా జీవితాల్లోకి విలువైన గిఫ్ట్’
ఇప్పుడు తన సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. ఐతే ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సమంత రెడీ అవుతోందని తెలుస్తోంది. దీనికోసం స్క్రిప్ట్‌లు కూడా వింటోందట. మంచ్రి స్క్రిప్ట్ దొరికితే వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నీల్ ఇవ్వడానికి రెడీగా ఉందట. ఈ న్యూస్ సామ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపుతోంది.
మంచి లవ్‌స్టోరీ చేయాలని సమంత డిసైడ్ అయిందంట. అలాంటి స్టోరీ కోసమే ఎదురుచూస్తోందని టాక్. ఇప్పటివరకు చాలామంది హీరోలతో జతకట్టిన సమంత.. హీరోయిన్ ఓరియెంటెడ్ కేరక్టర్స్ కూడా చేసింది. సమంత కెరీర్‌లో లవ్‌స్టోరీలు ది బెస్ట్‌గా నిలిచాయ్. దీంతో రీ ఎంట్రీకి కూడా అలాంటి స్టోరీస్‌నే చూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిందంట. ఇక సామ్ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా కూడా.. ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కాన్సెప్ట్ ఏంటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. సమంత రీ ఎంట్రీనే కిక్ అనుకుంటుంటే.. లవ్‌స్టోరీతే వస్తోంది అంటే.. డబుల్ కిక్ అని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. తిరిగి వచ్చేయ్ బ్రో అని ఓ ఫ్యాన్ కామెంట్ చేస్తే.. వస్తున్నా బ్రో అంటూ తన రీ ఎంట్రీపై సమంత క్లారిటీ ఇచ్చింది. ఇక అటు తన జీవిత పాఠాలను కూడా సామ్ బయటపెట్టింది. మౌనవ్రతం గురించి.. ఫోన్‌కు దూరంగా ఉన్న రోజుల గురించి అన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇదంతా ఎలా ఉన్నా.. రీ ఎంట్రీని సమంత కన్ఫార్మ్ చేయడం.. ఫ్యాన్స్‌ను క్లౌడ్ నైన్‌లో పడేస్తోంది.