Chef Mantra Project K : ఆహాలో సుమ కుకింగ్ షో.. ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ప్రొమో రిలీజ్.. పడి పడి నవ్వాల్సిందే.. ఈ స్టార్స్ వంట తింటే..
సుమ హోస్ట్‌గా చేస్తున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ప్రొమోను విడుదల చేశారు.

Suma Kanakala Chef Mantra Project K Promo out now
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుటుంబం అంతా కలిసి చూసేలా, వైవిధ్యమైన, మంచి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, టాక్ షోలతో ప్రేక్షకులకు ఎంతో చేరువైంది.
తాజా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్-కె తో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ చేస్తోంది. కమెడియన్ జీవన్ జడ్డిగా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రొమోను విడుదల చేశారు.
Jaya Prada : సినీ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం..
తొలి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ అంబటి అర్జున్, పృథ్వీ, విష్ణు ప్రియ, సుప్రీత, దీపిక, యాదవ్ రాజులతో పాటు ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ లు పాల్గొన్నారు. సుమ తనదైన టైమింగ్‌తో పంచులతో అదరగొట్టింది.
ఈ స్టార్స్ చేసిన వంటలను రుచి చూసేందుకు జడ్జిగా వచ్చిన జీవన్ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా ప్రోమో మాత్రం అదిరిపోయింది.
Jaya Prada : సినీ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం..
ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 6న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్ రానున్నట్లు తెలిపారు.