Kiara Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా.. ‘అతి త్వ‌ర‌లో మా జీవితాల్లోకి విలువైన గిఫ్ట్’

న‌టి కియారా అద్వానీ ఓ శుభ‌వార్త చెప్పింది.

Kiara Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా.. ‘అతి త్వ‌ర‌లో మా జీవితాల్లోకి విలువైన గిఫ్ట్’

Bollywood Actress kiara advani announces pregnancy

Updated On : February 28, 2025 / 5:09 PM IST

బాలీవుడ్ ముద్దు గుమ్మ కియారా అద్వానీ ఓ శుభ‌వార్త చెప్పింది. తాను ప్ర‌గ్నెంట్ అని చెప్పింది. త్వ‌ర‌లోనే త‌మ ఇంటిలోకి ఓ చిన్నారి అడుగుపెట్ట‌నున్నట్లు వెల్ల‌డించింది. చిన్నారులు వేసుకునే సాక్స్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది.

అతి త్వ‌ర‌లోనే మా జీవితాల్లో గొప్ప బహుమతి రానుంది. అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ సెల‌బ్రెటీలు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కియారా, సిద్దార్థ్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Chef Mantra Project K : ఆహాలో సుమ కుకింగ్ షో.. ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ప్రొమో రిలీజ్‌.. ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే.. ఈ స్టార్స్ వంట తింటే..

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, న‌టి కియారా అద్వానీ లు చాలా కాలం ప్రేమించుకున్నారు. 2023 ఫిబ్ర‌వ‌రిలో ఈ జంట జైపూర్‌లోని ఓ ప్యాలెస్ అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకుంది. ఇటీవ‌లే రెండో వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. ఈ క్ర‌మంలోనే కియారా శుభ‌వార్త చెప్పింది.

Jaya Prada : సినీ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట్లో తీవ్ర విషాదం..

కాగా.. కియారా, సిద్ధార్థ్ ఓ పార్టీలో తొలిసారి క‌లుసుకున్నారు. ఆ ప‌రిచ‌యం తొలుత స్నేహంగా ఆ త‌రువాత ప్రేమ‌గా మారింది. ఇక వీరిద్ద‌రు 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 2014లో ఫ‌గ్లీ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కియారా స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. త‌న భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి షేర్షా మూవీలో న‌టించింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అను నేను, రామ్‌చ‌ర‌ణ్‌తో విన‌య విధ‌య రామ‌, గేమ్ ఛేంజ‌ర్ చిత్రాల్లో న‌టించి తెలుగు వారికి కూడా ద‌గ్గ‌రైంది కియారా.