Manchu Vishnu Kannappa Ticket Rates Hike in AP
మంచు విష్ణు కన్నప్ప మూవీకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది.
ఈ మేరకు జీవో జారీ చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి పది రోజుల వరకు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్ కు మంచు విష్ణు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Manchu Vishnu : మంచు విష్ణు ఇంట్లో, ఆఫీస్‌లో జీఎస్టీ ఆధికారుల తనిఖీలు
విష్ణు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, కిరాతగా మోహన్‌లాల్, శివుడిగా అక్షయ్‌కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు.
Maargan : ఎల్లుండే రిలీజ్.. యూట్యూబ్‌లో ఆరు నిమిషాల మూవీ..
ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.