Maargan : ఎల్లుండే రిలీజ్.. యూట్యూబ్‌లో ఆరు నిమిషాల మూవీ..
విజయ్ ఆంటోనీ నటిస్తున్న చిత్రం మార్గన్.

Vijay Antony Maargan First 6 Minutes video out now
విజయ్ ఆంటోనీ నటిస్తున్న చిత్రం మార్గన్. లియో జాన్ పాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మర్డర్ మిస్టరీ – క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో అతడు విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందనలు వచ్చాయి.
COOLIE : రజనీకాంత్ ‘కూలీ’ నుంచి ‘చికిటు’ సాంగ్ వచ్చేసింది..
ఇక ఈ చిత్రం జూన్ 27 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని మొదటి ఆరు నిమిషాల వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.