Site icon 10TV Telugu

Tollywood Strike : టాలీవుడ్ సమ్మెపై ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మంచు విష్ణు చర్చలు.. ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం..

Manchu Vishnu Meeting with Film Chamber Regarding Tollywood Strike

Tollywood Strike

Tollywood Strike : ప్రస్తుతం టాలీవుడ్ లో అనధికార సమ్మె జరుగుతుంది. వేతనాలు ఏకంగా 30 శాతం పెంచేవరకు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలు తప్పుపట్టారు. లేబర్ కమిషన్ వరకు వెళ్లారు నిర్మాతలు. దీనిపై ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరుగుతున్నాయి. నేడు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరిపారు.

Also Read : Tollywood Strike : టాలీవుడ్ లో సమ్మె ఎఫెక్ట్.. చిరు, బాలయ్య, ప్రభాస్ తో సహా ఎవరెవరి షూటింగ్స్ ఆగిపోయాయి అంటే..

ఈ మీటింగ్ అనంతరం ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిలిం ఛాంబర్ తోనే మా అసోసియేషన్ కలసి వెళ్తుంది అని మంచు విష్ణు చెప్పారు. పేద సినీ కార్మికులకు మేము ఎప్పడూ అండగా వుంటాము. కానీ 7 లక్షలు, 8 లక్షలు తీసుకొని యూనియన్ లో సభ్యత్వం ఇస్తున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు కార్మికులకు ఎక్కువగానే చెల్లిస్తున్నాము. చిన్న, మద్య తరగతి నిర్మాతలు నలిగిపోతున్నారు. మేము చట్టపరంగా, న్యాయపరంగా వెళ్తున్నాము. ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువగానే ఉన్నాయి. మా కార్మికులతోనే పని చేయాలి అని యూనియన్ వాళ్ళు చెప్పారు, ఇది తప్పు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ని కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపు నిచ్చారు ఫెడరేషన్ వాళ్ళు. ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలు. కార్మికులు కూడా మాతో కలిసి వస్తారు అని ఆశిస్తున్నాను. నిర్మాతల పరిస్థితే బాగోలేదు. స్వార్థ పూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలసి చర్చించుకుందాం అని తెలిపారు.

Also See : Kiara Advani : వార్ 2 సాంగ్ షూట్.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన కియారా అద్వానీ..

Exit mobile version