Manchu Vishnu : తన హెయిర్ స్టైలిస్ట్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన మంచు విష్ణు.. అతనికి ఎంత సపోర్ట్ చేశాడో తెలుసా..
నటుడు మంచు విష్ణు గురించి తెలిసిందే. అయితే మంచు కుటుంబం చాలా మందికి సహాయం చేస్తుంటారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.

Manchu Vishnu opened his personal hair stylist Toyo Unisex Salon
Manchu Vishnu : నటుడు మంచు విష్ణు గురించి తెలిసిందే. అయితే మంచు కుటుంబం చాలా మందికి సహాయం చేస్తుంటారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే తన దగ్గర పనిచేస్తున్న వారిని సపోర్ట్ చేస్తుంటారు. తాజాగా తన దగ్గర ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్న మహేష్ టొయో యునిసెక్స్ సెలూన్‌ను ఓపెన్ చేసారు. శుక్రవారం (నవంబర్ 29) నాడు బంజారాహిల్స్‌లో ఈ సెలూన్ స్టార్ చేశారు.
Also Read : Allari Naresh : ‘నా నెక్స్ట్ రెండు సినిమాలు అవే’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అల్లరి నరేష్
ఈ సెలూన్ ఓపెనింగ్ ను మంచు విష్ణు, అతని భార్య విరానికా ప్రారంభించారు. సెలూన్ రిబ్బన్ కట్ చేసి అందరూ లోపలికి వెళ్లారు. ఇక ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ..”‘నేను స్టోర్స్ ఓపెనింగ్స్‌కు ఎక్కువగా వెళ్ళను. మహేష్ నా పర్సనల్ హెయిర్‌స్టైలిస్ట్. అందుకే వచ్చాను. 5 సంవత్సరాల క్రితం ఒక మంచి పర్మనెంట్ పర్సనల్ హెయిర్‌స్టైలిస్ట్ కోసం వెతుకుతున్నప్పుడు మహేష్ కలిసాడు. దీనికోసం అతను చాలా కష్టపడ్డాడు. ఇందుకోసం ప్రత్యేకంగా తనను దుబాయ్, యూరప్‌కు పంపాను” అంటూ తెలిపారు.
అంతేకాదు.. ప్రస్తుతం నేను చేస్తున్న కన్నప్ప సినిమాకి కూడా స్టైలిస్ట్‌గా పని చేశాడు. తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్ట పడ్డాడు. అలాంటిది ఇప్పుడు సొంతంగా సెలూన్ ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు విష్ణు.