Manchu Vishnu
MAA Elections 2021: ఈ ఏడాది ‘మా’ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్షబరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు CVL నరసింహారావు పోటీపడుతున్నారు. మధ్యలో సడెన్‌గా వచ్చి బండ్ల గణేష్ రచ్చ రచ్చ చేసి, తర్వాత సైలెంట్ అయిపోయాడు.
MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..
ఇటీవల ప్రకాష్ రాజ్ పలువురు సినీ ఆర్టిస్టులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారందరికీ విందు ఏర్పాటు చేశారు. దీని గురించి కూడా బండ్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న మంచు విష్ణు తన ప్యానెల్‌ని రెడీ చేసుకుంటున్నాడు.
MAA : అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు.. విష్ణు ప్యానెల్‌లో రఘుబాబు, బాబూ మోహన్
ఇప్పటికే మంచు విష్ణు టీమ్‌లో బాబు మోహన్, రఘు బాబు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ప్యానెల్‌ని ప్రకటించబోతున్నాడు విష్ణు.
MAA Elections: ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 10న పోలింగ్!
రేపు (సెప్టెంబర్ 23) తన ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్నాడు మంచు విష్ణు. ‘మా’ ఎన్నికల కోసం సినీ పరిశ్రమలోని మహా మహులను రంగం లోకి దింపబోతున్నట్లు సమాచారం. అతని ప్యానెల్ ప్రప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు ధీటుగా ఉండబోతుందని ఫిలిం వర్గాల వారు అంటున్నారు. అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరుగనున్నాయి.
Bandla Ganesh : ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి.. వివరణ ఇచ్చిన వీకే నరేష్