Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటిది కుదరదన్న ‘మా’ ప్రెసిడెంట్..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటిది కుదరదన్న ‘మా’ ప్రెసిడెంట్..!

Manchu Vishnu

Updated On : October 16, 2021 / 1:53 PM IST

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై.. తాను కానీ.. తన టీమ్ కానీ.. మీడియా ముందుకు ఇంటర్వ్యూల పేరుతో వచ్చేది లేదని తేల్చి చెప్పారు. తాము చేసే పనులే మాట్లాడతాయని.. తాము మాట్లాడేది ఉండదని అన్నారు. మీడియా కూడా ఈ విషయంలో తమకు సహకారం అందించాలని విష్ణు కోరారు.

2 వర్గాలు కలిసి గేమ్ ఆడినప్పుడు ఒకరు విన్నర్.. మరొకరు రన్నర్ ఉంటారని.. అంతే తప్ప లూజర్ అన్నవాళ్లెవరూ ఉండరని విష్ణు అన్నారు. మా.. ఎన్నికల్లోనూ అదే జరిగిందని.. తాము విన్నర్స్ అయితే.. అపోజిషన్ ప్యానెల్ వాళ్లు రన్నర్స్ అని చెప్పారు. వాళ్లందరి సహకారం తాను కోరతానని.. అసోసియేషన్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చేందుకు కలిసి పనిచేసేలా ముందుకు వెళ్తామని విష్ణు స్పష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లు రాజీనామా చేయడంపై విష్ణు స్పందించారు. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. అయినా.. షో మాత్రం కొనసాగుతుందని.. జరగాల్సిన పని జరుగుతుందని.. తాము చెప్పిన పనులు చేసి తీరతామని విష్ణు చెప్పారు. తన గెలుపులో.. తన ప్యానెల్ గెలుపులో సహకరించిన అందరికీ ప్రత్యేకంగా విష్ణు థ్యాంక్స్ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను స్ట్రాంగ్ గా మార్చడంలో అంతా కలిసి రావాలని కోరారు.

Read More:

Mohanbabu: రెచ్చగొట్టకండి.. మీడియా ముందుకు రాకండి.. కలిసి పని చేయండి..!

MAA Elections: కోర్టు మెట్లెక్కుతున్న ‘మా’ ఎన్నికల గొడవలు