Manchu Vishnu : వాట్.. మంచు విష్ణులో ఇంత ట్యాలెంట్ ఉందా..? హీరో కంటే ముందు ఏం చేసాడో తెలుసా..? ఇప్పుడు కన్నప్ప కోసం..

తాజాగా మంచు విష్ణు కన్నప్ప యాక్షన్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసాడు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Manchu Vishnu Shares Kannappa Action Making Video and tells Interesting thing about him

Manchu Vishnu : మంచు విష్ణు గతంలో హీరోగా మంచి హిట్ సినిమాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. అయితే మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్టార్స్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కించాడు మంచు విష్ణు. ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

తాజాగా మంచు విష్ణు కన్నప్ప యాక్షన్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసాడు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Manchu Lakshmi : ఆ రోజు మనోజ్ ని చూసి ఏడవడంపై మంచు లక్ష్మి కామెంట్స్.. నా కోసం ఎవరూ రాలేదు..

మంచు విష్ణు కన్నప్ప యాక్షన్ మేకింగ్ వీడియో షేర్ చేస్తూ.. చాలా మందికి తెలియదు నేను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాను. నటుడ్ని అవ్వకముందు లాస్ ఏంజిల్స్ లో స్టంట్ మెన్ గా పనిచేసాను. తెలుగు స్టంట్ మెన్ యూనియన్ లో మెంబర్ గా కూడా ఉన్నందుకు గర్వపడుతున్నాను. కన్నప్ప షో రన్నర్ గా ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాను. వాటికి ప్రాణం పోసినందుకు కెచా మాస్టర్ కు ధన్యవాదాలు అని తెలిపాడు.

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా మంచు విష్ణు ఫైట్ మాస్టర్ కూడానా, అమెరికాలో ఫైటర్ గా వర్క్ చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు.

Also See : Dhanashree Verma : క్రికెటర్ యుజేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ.. బాలీవుడ్ హీరోతో ఐటెం సాంగ్.. ఫోటోలు చూసారా?