Manchu Lakshmi : ఆ రోజు మనోజ్ ని చూసి ఏడవడంపై మంచు లక్ష్మి కామెంట్స్.. నా కోసం ఎవరూ రాలేదు..

కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి మనోజ్ సడెన్ గా రావడంతో మనోజ్ ని చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. మనోజ్ ని పట్టుకొని ఎమోషనల్ అయింది.

Manchu Lakshmi : ఆ రోజు మనోజ్ ని చూసి ఏడవడంపై మంచు లక్ష్మి కామెంట్స్.. నా కోసం ఎవరూ రాలేదు..

Manchu Lakshmi gives Clarity on Why she gets Emotional after Watching Manchu Manoj

Updated On : May 8, 2025 / 8:10 AM IST

Manchu Lakshmi : గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టు ఈ వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి మనోజ్ సడెన్ గా రావడంతో మనోజ్ ని చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. మనోజ్ ని పట్టుకొని ఎమోషనల్ అయింది. ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

తాజాగా మంచు లక్షి జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చింది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మనోజ్ ని పట్టుకొని ఏడ్చిన వీడియోని ప్లే చేసి దాని గురించి అడిగారు.

Also Read : Odela 2 : తమన్నా అఘోరిగా నటించిన ‘ఓదెల 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎందులో?

మంచు లక్ష్మి దానిపై స్పందిస్తూ.. నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేరు. నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. సడెన్ గా వాడ్ని అక్కడ చూసేసరికి నేను ఆనందంతో ఎమోషనల్ అయ్యాను. ఎవరు ఎంతమంది ఉన్నా ఫ్యామిలీని మెయిన్ అంటూ మరోసారి ఎమోషనల్ అయింది. ఇంకా మనోజ్ గురించి ఏం చెప్పిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు చూడాల్సిందే.

మంచు లక్ష్మి సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో మీరు కూడా చూసేయండి..