Odela 2 : తమన్నా అఘోరిగా నటించిన ‘ఓదెల 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎందులో?
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Tamannaah Bhatia Odela 2 Movie OTT Release Date Announced
Odela 2 : ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘ఓదెల 2’. తమన్నా మెయిన్ లీడ్ లో లేడీ అఘోరాగా ఈ సినిమాలో కనిపించింది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్ పై మధు నిర్మాణంలో సంపత్ నంది కథ, మాటలు అందించగా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల 2 సినిమా ఇటీవల ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
Also Read : NTR – Komalee Prasad : నేను ఎన్టీఆర్ కి హార్డ్ కొర్ ఫ్యాన్ ని.. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ స్పీచ్ ఒకటి..
థియేటర్స్ లో ఈ సినిమా పర్వాలేదనిపించింది. సినిమా బాగున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదని సమాచారం. హెబ్బా పటేల్, వశిష్ట సింహ, శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, గగన్ విహారి, మురళి శర్మ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఓదెల 2 సినిమా మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
సినిమా రిలీజయిన నెల రోజులు లోపే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఎవరైనా సినిమాని థియేటర్స్ లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మొదటి పార్ట్ లో రాధ(హెబ్బా పటేల్) తన భర్త తిరుపతి(వసిష్ఠ సింహ)ని చంపేసి జైలుకు వెళ్ళడంతో పార్ట్ 2 లో తిరుపతి శవాన్ని కాల్చకుండా ఊరివాళ్లంతా కలిసి తిరుపతి శవానికి సమాధి శిక్ష వేయాలి అని, శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా, మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఊరి వాళ్ళందరి మీద పగబడుతుంది. ఆరు నెలల తర్వాత ఊళ్లోకి తిరుపతి ఆత్మ వచ్చి ఊరి వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? ఆ ఆత్మని అఘోరి భైరవి(తమన్నా) ఎలా ఎదుర్కొంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Mangli – Mukesh Ambani : ముకేశ్ అంబానీతో సింగర్ మంగ్లీ.. ఫోటో వైరల్.. ఎప్పుడు? ఎక్కడ కలిసిందో తెలుసా?