Manchu Vishnu : రావణుడిగా మా నాన్న.. రాముడిగా.. రామాయణం తీయబోతున్న విష్ణు..? కానీ ‘రావణ’ కథతో..

మంచు విష్ణు రామాయణం సినిమాని తీయాలని ప్లాన్ చేసాడట.

Manchu Vishnu

Manchu Vishnu : మంచు విష్ణు ఇటీవలే కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కన్నప్ప తర్వాత తన దగ్గరున్న కథలనే సినిమాలుగా చేస్తానని తెలిపాడు. అయితే కన్నప్ప ప్రమోషన్స్ లో విష్ణు రామాయణం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల చాలామంది దర్శక నిర్మాతలు రామాయణ, మహాభారతాల మీదే సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. త్వరలో బాలీవుడ్ నుంచి ఒక రామాయణం రానుంది.

అయితే మంచు విష్ణు రామాయణం సినిమాని తీయాలని ప్లాన్ చేసాడట. కాకపోతే రావణుడి కథగా తీద్దామనుకున్నాడట. ఇంటర్వ్యూలో మంచు విష్ణు తాను తీయాలన్న రామాయణం గురించి, అందులో ఎవరెవరు ఏ పాత్ర వేయాలి అనుకుంటున్నాడో చెప్పుకొచ్చాడు.

Also Read : Nikhil Siddhartha : టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లపై నిఖిల్ ట్వీట్.. నేనే పాప్ కార్న్ కి ఎక్కువ ఖర్చుపెట్టాను..

మంచు విష్ణు మాట్లాడుతూ.. రావణుడి మీద ఒక స్క్రిప్ట్ ఉంది. రావణుడు పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంతవరకు ఉంటుంది అందులో. రావణ స్క్రిప్ట్ ని తీసుకొని సూర్యని 2009 లోనే కలిసాను అందులో రాముడి పాత్ర వేయమని. బడ్జెట్ వర్కౌట్ అవ్వక ఆ సినిమా అవ్వలేదు. ఆ సినిమాని డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేయాలి. మా నాన్న రావణుడి పాత్ర చేయాలి. డైలాగ్స్ కూడా రాసేసాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందులో నేను హనుమంతుడి పాత్ర చేయాలి అనుకున్నాను. కానీ రాఘవేంద్రరావు గారు నన్ను హనుమంతుడు చేయొద్దు, ఇంద్రజిత్ పాత్ర చేయమన్నారు. నేను కార్తీని ఇంద్రజిత్ పాత్రకు అనుకున్నాను. ఇప్పుడు చేస్తే వాళ్ళతోనే చేస్తాను. రాముడిగా సూర్య, సీతగా అలియా భట్, రావణుడిగా మా నాన్న, కళ్యాణ్ రామ్ లక్ష్మణుడు పాత్రలో, జటాయువుగా సత్యరాజ్ ని తీసుకుంటాను అని అన్నారు. మరి విష్ణు నిజంగానే రావణ సినిమా తీస్తాడా చూడాలి.

Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా? కొత్త సాంగ్ తో రిలీజ్..