Nikhil Siddhartha : టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లపై నిఖిల్ ట్వీట్.. నేనే పాప్ కార్న్ కి ఎక్కువ ఖర్చుపెట్టాను..
తాజాగా హీరో నిఖిల్ సిద్దార్థ టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్ల గురించి ట్వీట్ చేసారు.

Nikhil Siddhartha
Nikhil Siddhartha : సినీ పరిశ్రమకు ఉన్న పెద్ద సమస్యల్లో ఒకటి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, వాటితో పాటు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం. దీనిపై ప్రేక్షకులే కాక సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ సిద్దార్థ టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్ల గురించి ట్వీట్ చేసారు.
నిఖిల్ తన ట్వీట్ లో.. టికెట్ ధరలపై పరిమితి విధించాలి. కానీ దానికంటే పెద్ద సమస్య ఏంటంటే పాప్‌కార్న్ మరియు కూల్‌డ్రింక్స్‌లను దారుణమైన రేట్లకు అమ్ముతున్నారు. ఇటీవల నేను ఒక సినిమాని థియేటర్లో చూసాను. కానీ నేను చూసిన సినిమా కంటే స్నాక్స్ కోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. బిగ్ స్క్రీన్ పై ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించేలా చేయాలంటే దయచేసి ఈ సమస్యని పరిష్కరించాలని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ ని కోరుకుంటున్నాను. కనీసం వాటర్ బాటిల్స్ ని అయినా లోపలికి తెచ్చుకోనివ్వండి అని తెలిపాడు.
Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా? కొత్త సాంగ్ తో రిలీజ్..
మరి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎప్పటికి తగ్గుతాయి చూడాలి. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ది ఇండియన్ హౌస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
At least allow us to take our Water bottles into the Theatres .
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2025
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే.. ఈసారి రాజకీయ నాయకులే..