HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే.. ఈసారి రాజకీయ నాయకులే..
నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా వస్తారో తెలిపారు.

HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనుంది. ఈ ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులు ఎవరు వస్తారో అని పెద్ద చర్చే నడుస్తుంది.
గతంలో రాజమౌళి, చిరంజీవి అని పేర్లు వినిపించాయి. నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా వస్తారో తెలిపారు.
Also Read : AM Rathnam : పవన్ కళ్యాణ్ తో నా అనుబంధం 25 ఏళ్ళు.. హరి హర వీరమల్లు సినిమా గురించి నిర్మాత కామెంట్స్..
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు. ప్రస్తుతానికి ఈ ఈవెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖన్ద్రే గెస్టులుగా రానున్నారు. ఆయన్ని పవన్ గారే పిలవమన్నారు. అందుకే నేనే స్వయంగా వెళ్లి పిలిచాను. చిరంజీవి గారు రావట్లేదు. ఫ్యామిలీ వద్దన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాజమౌళి గారు రావొచ్చు. నేను ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ గారు వస్తారు అని అన్నారు.
దీంతో ఈసారి కాస్త పొలిటికల్ గా కూడా ఈవెంట్ సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఏపీకి కొంకి ఏనుగుల విషయంలో సపోర్ట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని బాగా పొగిడారు. అలాగే పార్టీలు వేరైనా ఒక మంచి విషయం కోసం కలిసి పనిచేసే ఆయన తత్వం పవన్ కళ్యాణ్ కి నచ్చింది. అందుకే ఆయన్ని పిలవమన్నట్టు తెలుస్తుంది.
Also Read : Sudheer – Pradeep : చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ – ప్రదీప్.. ప్రోమో వైరల్..