Sudheer – Pradeep : చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ – ప్రదీప్.. ప్రోమో వైరల్..
గతంలో ఢీ షోలో వీరిద్దరూ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Sudheer Pradeep
Sudheer – Pradeep : సుడిగాలి సుధీర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే టీవీ షోలు చేస్తున్నాడు. ఒకప్పుడు బుల్లితెరని ఏలిన యాంకర్ యాంకర్ ప్రదీప్ కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఒకే షోలో కనిపించి చాన్నాళ్ళైంది. గతంలో ఢీ షోలో వీరిద్దరూ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరోసారి కనిపించబోతున్నారు.
సుధీర్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో సర్కార్ షో వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్ కంటెస్టెంట్ గా వచ్చాడు. గతంలో ప్రదీప్ ఈ షోని హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ప్రదీప్ ఇప్పుడు ఈ షోకి సుధీర్ హోస్ట్ గా చేస్తున్నప్పుడు రావడంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈ ఇద్దరూ కలిసి. వీరి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు.
Also Read : Kingdom : హిందీలో మరో పేరుతో రిలీజ్ అవ్వబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. బాలీవుడ్ టైటిల్ ఏంటో తెలుసా?
ప్రోమోలో ఇద్దరూ కలిసి సందడి చేసారు. ప్రోమోలోనే ఇలా ఉంటే ఎపిసోడ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత సుధీర్ – ప్రదీప్ కలిసి షోలో కనపడి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో వీరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఎపిసోడ్ జులై 25న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మీరు కూడా వీరిద్దరూ కలిసి సందడి చేసిన ప్రోమో చూసేయండి..
Also Read : Hari Hara VeeraMallu : పవన్ ఫ్యాన్స్ కి పండగే.. ముందు రోజే ప్రీమియర్లు.. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి?