Kingdom : హిందీలో మరో పేరుతో రిలీజ్ అవ్వబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. బాలీవుడ్ టైటిల్ ఏంటో తెలుసా?
కింగ్డమ్ ఏదో కొత్తగా, భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్డమ్’. విజయ్ ఒక మంచి హిట్ కొట్టి చాన్నాళ్లు అయిపొయింది. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా ఆసక్తి నెలకొంది.
కింగ్డమ్ ఏదో కొత్తగా, భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. కింగ్డమ్ సినిమా కేవలం హిందీ, తమిళ్, తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. ఇటీవల సినిమాలు అన్ని ఒకే టైటిల్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి ఆయా భాషల్లో అర్ధం తెలియకపోయినా అదే టైటిల్ తో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. కానీ కింగ్డమ్ సినిమా హిందీలో వేరే పేరుతో రిలీజ్ కాబోతుంది.
Also Read : Hari Hara VeeraMallu : పవన్ ఫ్యాన్స్ కి పండగే.. ముందు రోజే ప్రీమియర్లు.. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి?
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసి బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో గతంలో విజయ్ లైగర్ సినిమాతో బాగా దెబ్బ తిన్నాడు. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో అయినా బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటాడా చూడాలి. ఇక కింగ్డమ్ సినిమా జులై 31 రిలీజ్ కాబోతుంది.