Manisharma : ఛాన్సులు లేక బాధపడుతున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ..

తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించి మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్నారు. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు ఇస్తే బాగుండు అని బాధపడుతున్నారు.

Mani Sharma suffers from lack of chances in Industry Sensational Comments goes Viral

Manisharma : మణిశర్మ పేరు వినగానే మన స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. లకు మాత్రమే కాక అప్పట్లో ఎంతోమంది హీరోలకు ఇచ్చిన సూపర్ హిట్ పాటలు గుర్తొస్తాయి. ప్రతి హీరో కెరీర్ లో మణిశర్మ ఇచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది. ఇక మెగాస్టార్ కెరీర్ లో అయితే మణిశర్మ లైఫ్ టైం గుర్తుండిపోయే ఆల్బమ్స్, ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు ఇచ్చారు.

ఇప్పటికి మణిశర్మ పాటలు రోజు వింటూనే ఉంటారు. 1998 నుంచి ఆల్మోస్ట్ 2011 వరకు మణిశర్మ యుగం నడిచింది. ఎన్నో వందల అద్భుతమైన పాటలతో పాటు ఎన్నో మర్చిపోలేని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు మణిశర్మ సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు అందించాడు. తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించి మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్నారు. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు ఇస్తే బాగుండు అని బాధపడుతున్నారు.

గత కొన్నాళ్లుగా మణిశర్మ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పెరగడం, బయటి నుంచి తెచ్చుకోవడంతో మణిశర్మకి అవకాశాలు తగ్గాయి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అవ్వడంతో ఆయన ఎవర్ని వెళ్లి అవకాశం ఇమ్మని అడగలేరు. దీంతో వచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తున్నారు. 2023లో మణిశర్మ నుంచి ఒక్కటే సినిమా వచ్చింది. 2022 లో అది కూడా లేదు. ఇప్పుడు మణిశర్మ చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. ఈ విషయంలో మణిశర్మ చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Hanuman : ‘హనుమాన్’ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం విన్నారా.. గూస్ బంప్స్ గ్యారెంటీ..

తాజాగా మణిశర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎక్కువ అవకాశాలు రాకపోవడంపై స్పందిస్తూ.. నేను హార్ట్ అయ్యేది ఒకటే రీజన్ ఏంటంటే, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలు అయినా అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. థమన్ కి ఒకటి, దేవి కి ఒకటి, నాకు ఒకటి. పోనీ వాళ్ళకి రెండు, నాకు ఒకటి ఇచ్చినా ఆడియన్స్ కి కొత్త కొత్త మ్యూజిక్ అన్ని రకాలు, వెరైటీ వస్తుంది. ఇది నా వరకు అనుకుంటాను, కానీ నేను వెళ్లి వాళ్ళని అడగలేను అంటూ తెలిపారు. దీంతో మణిశర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఎంతోమంది హీరోలకు కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చి ఇప్పుడు ఇలా ఛాన్సులు లేవని బాధపడటం వైరల్ గా మారింది. మరి మణిశర్మకు మున్ముందు అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.