Maniratnam : కమల్ హాసన్ కోసం మణిరత్నం కాపీ కొట్టారా? KH234 ఆ సినిమాకు కాపీ అంటూ ట్రోల్స్..

కమల్ హాసన్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి 'థగ్ లైఫ్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు. ఇందులో కమల్ ఫైట్ చేసే ఓ సీన్ పెట్టారు.

Maniratnam Copied a Scene From Star Wars The Rise of Sky walker Movie for Kamal Haasan Thug Life

Maniratnam : దర్శకుడు మణిరత్నం దాదాపు 36 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్(Kamal Haasan) తో కలిసి సినిమా తీయబోతున్నారు. కమల్ హాసన్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి ‘థగ్ లైఫ్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు. ఇందులో కమల్ ఫైట్ చేసే ఓ సీన్ పెట్టారు.

అయితే ఈ సీన్ ఓ హాలీవుడ్(Hollywod) సినిమా నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సీన్ ని హాలీవుడ్ ‘స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కై వాకర్స్’ అనే సినిమా నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాలోఉండే ఒక ఫైట్ సీన్ ని అచ్చు గుద్దినట్టు మణిరత్నం కమల్ తో చేయించాడు. దీంతో మణిరత్నం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరి ప్రస్తుతానికి సీన్ మాత్రమే తీసుకున్నారా? సినిమా కూడా కాపీ కొడుతున్నారా అనే వార్తలు వస్తున్నాయి.

Also Read : Vishwak Sen : ‘మెగా పవర్ స్టార్‌’తో ‘మాస్ కా దాస్’.. వైరల్ అవుతున్న ఫొటో..

ఇక గతంలో మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా కుడా హాలీవుడ్ గాడ్ ఫాదర్ సినిమా ప్రేరణతోనే చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా మరో హాలీవుడ్ సినిమాకు ప్రేరణగా తీసుకొని తెరకెక్కిస్తున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే దీనిపై మణిరత్నం మాత్రం స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు