Manju Warrier : బైక్ పై లాంగ్ రైడింగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్..

హీరో అజిత్ తనకు సమయం కుదిరినప్పుడల్లా బైక్ పై లాంగ్ రైడింగ్స్ చేస్తాడని తెలిసిందే. తునివు సమయంలో అజిత్ తో కలిసి మంజు, మరికొంతమంది లడఖ్ వరకు బైక్ రైడింగ్ చేశారు. అప్పట్లో ఈ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.

Manju Warrier Bike Riding pics goes viral

Manju Warrier :  మలయాళం(Malayalam) స్టార్ హీరోయిన్ మంజు వారియర్ తన సినిమాలతో కేరళలోనే కాక బయటి రాష్ట్రాల్లో కూడా అభిమానులని సంపాదించింది. మలయాళం, తమిళ్(Tamil) సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 44 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ హీరోయిన్ లానే కనిపిస్తూ స్టార్ హీరోల సరసన ఆడిపాడుతుంది. ఇటీవల మంజు వారియర్(Manju warrier) తమిళ్ స్టార్ హీరో అజిత్(Ajith) తో కలిసి తునివు(Thunivu) సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మంజుకి ఆల్రెడీ బైక్ రైడింగ్ వచ్చు. హీరో అజిత్ తనకు సమయం కుదిరినప్పుడల్లా బైక్ పై లాంగ్ రైడింగ్స్ చేస్తాడని తెలిసిందే. తునివు సమయంలో అజిత్ తో కలిసి మంజు, మరికొంతమంది లడఖ్ వరకు బైక్ రైడింగ్ చేశారు. అప్పట్లో ఈ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. అజిత్ తనకి లాంగ్ బైక్ రైడింగ్స్ అలవాటు చేశాడని మంజు గతంలో చెప్పింది. తాజాగా మంజు వారియర్ మరోసారి బైక్ రైడింగ్ కు వెళ్ళింది.

Pooja Hegde : నా సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు. నేను కాదు..

మలయాళ నటులు సౌబిన్ షాహిర్, బినేష్ చంద్ర కూడా ఆమెతో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లారు. బైక్ రైడింగ్ మధ్యలో వారితో కలిసి దిగిన ఫోటోలని మంజు వారియర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేను ఎదుర్కొని భయాలు నా లిమిట్స్ లో ఉంటాయి. ఈ ప్రయాణంలో నా కోసం నిలిచిన నా ఫ్రెండ్స్ సౌబిన్ షాహిర్, బినేష్ చంద్రలకు ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో మరోసారి మంజు వారియర్ బైక్ రైడింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.