Pooja Hegde : నా సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు. నేను కాదు..
పూజా హెగ్డే గత నాలుగు సినిమాలు రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్.. అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డే మంచి విజయ కోసం ఎదురుచూస్తుంది.

Pooja Hegde comments on her flap movies
Pooja Hegde : కన్నడ భామ పూజా హెగ్డే సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమా ఛాన్సులు సంపాదిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీలో పూజా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పూజా(Pooja Hegde) సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో పూజా హెగ్డే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
పూజా హెగ్డే గత నాలుగు సినిమాలు రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్.. అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డే మంచి విజయ కోసం ఎదురుచూస్తుంది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి బాలీవుడ్ లో ఛాన్సులు పట్టేయాలని చూస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇటీవల వరుసగా తనకి వచ్చిన ఫ్లాప్స్ గురించి అడగగా పూజా హెగ్డే దీనిపై స్పందించింది.
Parineeti Chopra : ఎంపీతో డేటింగ్ పై మొదటి సారి స్పందించిన పరిణీతి.. ఏమందో తెలుసా?
పూజా హెగ్డే మాట్లాడుతూ.. నా అన్ని సినిమాలకు నేను ఎప్పుడూ ఒకేలా ఉత్సాహంగా ఉంటాను. అసలు సినిమా సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు ఏ అవకాశం వస్తే దాన్నే కెరీర్ గా మార్చుకున్నాను. నా సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ నేను ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. నేను నటించిన సినిమాల్లో నా బెస్ట్ ఇచ్చాను. నా కథ ఏదో ఒక రోజు ఎవరికైనా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపింది.