Parineeti Chopra : ఎంపీతో డేటింగ్ పై మొదటి సారి స్పందించిన పరిణీతి.. ఏమందో తెలుసా?

గత కొద్దీ రోజులుగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో(Raghav Chadha) డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Parineeti Chopra : ఎంపీతో డేటింగ్ పై మొదటి సారి స్పందించిన పరిణీతి.. ఏమందో తెలుసా?

Parineeti Chopra reacts on love with raghav chadha

Updated On : April 19, 2023 / 9:15 AM IST

Parineeti Chopra :  బాలీవుడ్ లో లవ్ అఫైర్స్, డేటింగ్ రూమర్స్ చాలా కామన్ గా వింటూనే ఉంటాము. బాలీవుడ్(Bollywood) హీరోలు, హీరోయిన్స్ ఎవరితో ఒకరితో ముంబైలో(Mumbai) షికార్లు చేస్తూనే కనపడతారు. ఇటీవల గత కొద్దీ రోజులుగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో(Raghav Chadha) డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. మరోసారి ఎయిర్‌పోర్ట్ లో కనిపించారు. దీంతో వీరి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. రాఘవ్, పరిణీతి ముంబైలోని ఓ రెస్టారెంట్ లో నైట్ డిన్నర్ చేసి వెళ్తూ అక్కడ ఉన్న మీడియాకి పోజులు కూడా ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మరో ఆప్ ఎంపీ వీరిద్దరి ఫొటోలు షేర్ చేసి కంగ్రాట్స్ చెప్పడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పటివరకు వీటిపై ఇద్దరూ స్పందించలేదు.

Rowdy Rathore : విక్రమార్కుడు సీక్వెల్ త్వరలో.. కానీ తెలుగులో కాదు..

తాజాగా పరిణీతి చోప్రా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. రాఘవ్ తో డేటింగ్ గురించి పరిణీతిని ప్రశ్నించగా పరిణీతి మాట్లాడుతూ.. మీడియా నా జీవితం గురించి చర్చించడం, నా వ్యక్తిగత విషయాల్లోకి వచ్చిమరీ మాట్లాడటం మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. వాళ్ళు మితిమీరి మాట్లాడితే నేను స్పందిస్తాను, లేకపోతే నాకు స్పందించాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటివి సహజమే. ఏదైనా ఉంటే నేనే స్వయంగా స్పష్టంగా చెప్తాను. నేను ఎక్కడ కనపడినా ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను అనే అడుగుతారు. కానీ ఇది నాజీవితం కదా. నా జీవితాన్ని నేను చూసుకోగలను అని తెలిపింది. డైరెక్ట్ గా రాఘవ్ గురించి మాత్రం మాట్లాడకుండా ఏమైనా ఉంటే తానే చెప్తాను అని చెప్పడంతో రాఘవ్ తో డేటింగ్ లో ఉందా, లేదా అని మరోసారి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.