Manjummel Boys Screening Stop by PVR Multiplexes allover India due to Issues with Producers
Manjummel Boys : ఇటీవల మలయాళంలో చిన్న సినిమాగా రిలీజయి ఏకంగా 200 కోట్లు కలెక్షన్స్ సాధించి భారీ హిట్ కొట్టింది మంజుమ్మల్ బాయ్స్ సినిమా. దీంతో మంజుమ్మల్ బాయ్స్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా మంజుమ్మల్ బాయ్స్ ని తెలుగులో ఏప్రిల్ 6న రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది.
తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మలయాళ చిత్ర నిర్మాతలతో సినిమా ప్రదర్శనలపై పీవీఆర్ మల్టిప్లెక్స్ తో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ మల్టిప్లెక్స్ దేశవ్యాప్తంగా తమ థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ స్క్రీనింగ్ ని అర్దాంతరంగా ఆపేసాయి. అయితే తెలుగు వర్షన్ ని కూడా ఆపేయడంతో తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసిన మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
మలయాళంలో అక్కడి నిర్మాతలతో సమస్య ఉంటే ఇక్కడ తెలుగులో సినిమా ఆపడం ఏంటి అంటూ మైత్రీ మూవీస్ పీవీఆర్ మల్టిప్లెక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ వ్యవహారంపై నిర్మాతల మండలి సమావేశం కానుంది. మరి మళ్ళీ థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ ని స్క్రీనింగ్ చేస్తారా? లేక వివాదం మరింత పెద్దదవుతుందా చూడాలి.