Pushpa : నా పాత ఫ్రెండ్ పాన్ ఇండియా ఐకాన్ అయ్యాడు.. బన్నీ పై మారుతి వ్యాఖ్యలు

ఈ సినిమా 50 రోజులు పూర్తి అయినా సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతీ అల్లు అర్జున్ ని కలిసి అభినందించారు. అల్లు అర్జున్ కి పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు..........

Allu Arjun

 

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా “పుష్ప” పాన్ ఇండియా వైడ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అన్ని భాషల్లోనూ పెద్ద విజయం సాధించి కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయి నిన్నటికి 50 రోజులు అయింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపారు. బాలీవుడ్ లో 100 కోట్ల వసూళ్లు కూడా సాధించింది పుష్ప సినిమా.

Chiranjeevi : పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..

ఈ సినిమా 50 రోజులు పూర్తి అయినా సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతీ అల్లు అర్జున్ ని కలిసి అభినందించారు. అల్లు అర్జున్ కి పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత బన్నీతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”నా ప్రియమైన, పాత స్నేహితుడు ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్ గా మారడం చాలా ఆనందంగా ఉంది. 100 కోట్లతో బాలీవుడ్ డెబ్యూ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ‘పుష్ప’ సినిమా ఈసారి అన్ని అవార్డ్స్ ని కూడా స్వీప్ చేస్తుంది. బన్నీ తన హార్డ్ వర్క్, ప్యాషన్ తో మరింత సాధించి మమ్మల్ని గర్వపడేలా చెయ్యాలని కోరుకుంటున్నాను” అని మారుతీ పోస్ట్ చేశారు.