Chiranjeevi : పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పారు చిరంజీవి. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి........

Chiranjeevi :  పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..

Acharya

Chiranjeevi :   ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండేవారు. స్టార్ హీరోలు సైతం సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి. అంత ఫాస్ట్ గా సినిమాలు రిలీజ్ అవ్వాలంటే అంతే ఎక్కువ కష్టపడాలి. అప్పటి హీరోలు రోజూ రెండు సినిమాల షూటింగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. రోజుకి రెండు షిఫ్టులు పనిచేశారు. కానీ ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తేనే గ్రేట్. కరోనా దెబ్బతో సినిమాలు మరింత నత్త నడకన సాగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పారు చిరంజీవి. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి. చిరంజీవి అన్నిటికి డేట్స్ ఇస్తున్నాడు. ఇటీవల కరోనా వచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. కరోనా తగ్గడంతో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్నారు చిరంజీవి.

Kiran Abbavaram : రేచీకటి పాత్రలో కిరణ్ అబ్బవరం.. ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ రిలీజ్

ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయ్యింది. మరో వైపు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్ మరియు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి వాటికి సమానంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు చిరు. ఇటీవలే ఈ సినిమా షూట్ కోసం నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చింది.

Rana : క్లైమాక్స్ లేని రానా ‘1945’ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

చిరంజీవి ఒక వైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో వైపు రాత్రి పూట ‘ఆచార్య’ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పగలు షూటింగ్, రాత్రి డబ్బింగ్ తో బిజీగా ఉన్నారు చిరంజీవి. చిరంజీవిని చూసి ఇప్పటి యువ హీరోలు చాలా నేర్చుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.