×
Ad

The Raja Saab: రాజాసాబ్ ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు.. అది వాళ్ళ భయం!

ది రాజాసాబ్(The Raja Saab) సినిమాపై చాలా మంది నెగిటీవ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు మారుతి.

Maruti shocking comments about negative publicity surrounding The Raja Saab movie

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబోలో వస్తున్న సినిమా ది రాజాసాబ్. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్. రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో, సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dhurandhar: ధురంధర్ మూవీకి సెన్సార్ షాక్.. ఆ పదాన్ని తొలగించాలట.. ఇంతకీ ఏంటా పదం!

ఈనేపథ్యంలోనే తాజాగా రాజాసాబ్(The Raja Saab) మూవీ ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టాడు దర్శకుడు మారుతీ. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజాసాబ్ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ యాంకర్ ఇండస్ట్రీలో కొంతమంది, మీకు బాగా తెలిసిన వ్యక్తిలు కూడా రాజాసాబ్ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు. దానికి కారణం ఏంటి” అని అడిగాడు.

దానికి సమాధానంగా మారుతీ మాట్లాడుతూ..’ఎవరికి నచ్చినట్టు వాళ్లు కోరుకుంటారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేది ఈ సమాజంలో సహజం. నేను చిన్న సినిమాల ఈవెంట్లకు చాలా వెళ్తాను. కాబట్టి, నాకు భారీ సక్సెస్‌ వస్తే వేల్లనేమో అని వాళ్ల భయం. కానీ.. నేను అలా ఎప్పటికీ ఆలోచించను. నేనెప్పుడూ స్టార్‌డమ్‌ ను పట్టించుకోను. ది రాజాసాబ్‌ తర్వాత కూడా చిన్న సినిమా సెట్ అయితే చేస్తాను. నాకు కథ ముఖ్యం. నేను కోరుకునేది ఒక్కటే, ఎప్పుడూ పని ఉండాలని’ అంటూ కామెంట్ చేశాడు మారుతీ. దీంతో మారుతీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.