Dhurandhar: ధురంధర్ మూవీకి సెన్సార్ షాక్.. ఆ పదాన్ని తొలగించాలట.. ఇంతకీ ఏంటా పదం!

ధురంధర్(Dhurandhar) సినిమాలో కొన్ని సంభాషణలను తొలగించాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Dhurandhar: ధురంధర్ మూవీకి సెన్సార్ షాక్.. ఆ పదాన్ని తొలగించాలట.. ఇంతకీ ఏంటా పదం!

Censor board ordered to dhurandhar movie makers to remove some dialogues

Updated On : January 1, 2026 / 2:54 PM IST

Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు. గూఢచారి నేపధ్యంలో సాగే ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. కేవలం 26 రోజుల్లోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్ల మార్కుని దాటేసింది. ఇంకా ఈ సినిమా సౌత్ భాషల్లో విడుదల కాలేదు. విడుదల అయ్యాక ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Mana ShankaraVaraPrasad Garu: అతి పెద్ద ప్రమోషన్స్.. నయన్ మాటలకి అనిల్ షాక్.. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు

ఇదిలా ఉంటే, తాజాగా ధురంధర్(Dhurandhar) సినిమాకు సెన్సార్ షాక్ ఇచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని తొలగించాలని, మరికొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయాలనీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ అనే పదాన్ని తప్పకుండా తొలగించాలంటూ ప్రభుత్వం కోరింది. దీంతో, జనవరి 1 నుంచి ఈ మార్చిన విధంగా సినిమా ప్రదర్శన జరుగనుంది. ఇప్పటికే మార్చిన DCPలను పంపింణీ చేశారని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.