Mana ShankaraVaraPrasad Garu: అతి పెద్ద ప్రమోషన్స్.. నయన్ మాటలకి అనిల్ షాక్.. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు

మన శంకర వరప్రసాద్ గారు(Mana ShankaraVaraPrasad Garu) సినిమా ప్రమోషన్స్ ని అఫీషియల్ గా స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి, నయనతార.

Mana ShankaraVaraPrasad Garu: అతి పెద్ద ప్రమోషన్స్.. నయన్ మాటలకి అనిల్ షాక్.. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు

Anil Ravipudi officially started mana Shankar Varaprasad garu movie promotions

Updated On : January 1, 2026 / 2:31 PM IST

Mana ShankaraVaraPrasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ అండ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరజీవి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

Pawan-Prabhas: పవన్, ప్రభాస్ చేసిన సాయం ఎవరికీ తెలియదు.. యాంకర్ సుమ ఎమోషనల్ కామెంట్స్

ఇదిలా ఉంటే, సినిమాను ప్రమోట్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తరువాతనే ఎవరైనా. తన స్టైల్ ఫన్ ని జోడిస్తూ ఆడియన్స్ కి నచ్చేలా, వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తుంటాడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఈ టైపు ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అదే పంథాని మన శంకర వరప్రసాద్ గారు(Mana ShankaraVaraPrasad Garu) సినిమాకు కూడా ఫాలో అవుతున్నాడు అనిల్. ఇప్పటికే, సినిమా స్టార్టింగ్ టైం లోనే అలాంటి వీడియో ఒకటి ప్లాన్ చేశాడు. ఆ వీడియోకి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా హీరోయిన్ నయనతార తో కలిసి ప్రమోషన్స్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసాడు అనిల్. ఈ వీడియోలో స్వయంగా నయనతార వచ్చి సినిమా స్టార్టింగ్ లో ఒక ప్రమోషనల్ వీడియో చేశాం. మరి ఇప్పుడు ఎం లేదా అని అనిల్ ని అడుగుతుంది. దానికి షాక్ అయినా అనిల్ మీరు ప్రమోషన్స్ ని అడగడమే పెద్ద ప్రమోషన్స్. మీరు జస్ట్ జనవరి 12 రిలీజ్ అని చెప్పండి మేడం అని అంటాడు. ఆ తరువాత నయనతార వచ్చి హలో మాస్టారు ఫేస్ కొంచం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటుంది’ ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది అసలు ఇలాంటి ఐడియాల ఎలా వస్తాయండి మీకు అంటూ అనిల్ ని అడుగుతున్నాను.