Pawan-Prabhas: పవన్, ప్రభాస్ చేసిన సాయం ఎవరికీ తెలియదు.. యాంకర్ సుమ ఎమోషనల్ కామెంట్స్

పవన్ కళ్యాణ్, ప్రభాస్(Pawan-Prabhas) చేసిన సాయం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన టాప్ యాంకర్ సుమ.

Pawan-Prabhas: పవన్, ప్రభాస్ చేసిన సాయం ఎవరికీ తెలియదు.. యాంకర్ సుమ ఎమోషనల్ కామెంట్స్

Anchor Suma emotional comments about the help of Pawan Kalyan and Prabhas.

Updated On : December 30, 2025 / 10:06 AM IST

Pawan-Prabhas: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు. తమవంతుగా సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కానీ, చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, హీరోలు అంటే భారీ రెమ్యునరేషన్లు, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. కానీ, వారికి కూడా ఒక మనసు ఉంటుంది. మనకు తెలియకుండా చాలా మంది గొప్ప గొప్ప సేవ కార్యక్రామాలు చేస్తున్నారు. వారిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్(Pawan-Prabhas) ముందు వరుసలో ఉంటారు.

Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. మరోసారి సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నాడా.?

ఈ హీరోలు కేవలం సినిమాలు మాత్రమే సేవ కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా ముందు ఉంటారు. అలా వారు చేసిన చాలా మంచి పనుల గురించి ఎవరికీ తెలియదు. తాజాగా ఈ ఇద్దరు హీరోల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ. రీసెంట్ గా ఈ విషయాల గురించి చెప్పుకొచ్చారు సుమ. ‘తెలంగాణలోని ఖమ్మంలో ఓ వృద్ధాశ్రమం నిర్మించడానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లు చాలా సహాయం చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మరికొంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతేకాదు, వృద్ధాశ్రమంలో ఉండే పెద్దల కోసం, వారి యోగక్షేమాల కోసం ప్రతీనెలా డబ్బులు ఉక్కడ పంపిస్తుంటారు”అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ సుమ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ తమ హీరోల గురించి ఇలా చెప్పడం పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హీరోలకి ఫ్యాన్స్ అయినందుకు గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.