Mass Jathara pre release event on october 28th
Mass Jathara pre release event : మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తోంది. అక్టోబర్ 28 (మంగళవారం) హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Chiranjeevi : డీప్ ఫేక్ బారిన చిరు.. కేసు నమోదు
The celebration just got BIGGER! 💥🔥
The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍
📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!
In cinemas worldwide #MassJatharaOnOct31st
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM
— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025
ధమాకా తరువాత రవితేజ, శ్రీలీల నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్ర నిడివి 160 నిమిషాలుగా తెలుస్తోంది.