Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

సినీ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు.

Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

Mega star Chiranjeevi has affected by deepfakes

Updated On : October 27, 2025 / 10:51 AM IST

Chiranjeevi : డీప్‌ఫేక్ టెక్నాల‌జీ సెలెబ్రీటీల పాలిట శాపంగా మారింది. ఈ స‌రికొత్త టెక్నాల‌జీని ఎక్కువ శాతం చెడు ప‌నుల‌కే ఉప‌యోగిస్తున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టుల‌కు సంబంధించిన ఫేక్ వీడియోలను త‌యారీ చేసి వాటిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కాజోల్‌, కత్రినా, ర‌ష్మిక మంధాన వంటి వారు ఈ డీప్ ఫేక్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సీనీ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు.

చిరంజీవి ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియాలో దుండ‌గులు పోస్ట్ చేశారు. అవి వైర‌ల్‌గా మారాయి. ఈ విష‌యం చిరంజీవి దృష్టికి చేర‌డంతో ఆయ‌న వెంట‌నే సీపీ వీసీ స‌జ్జ‌నార్‌కు ఫిర్యాదు చేశారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. త‌న పేరును దెబ్బ‌తీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిరు కోరారు.