Maas Jathara : రవితేజ ‘మాస్ జాతర’ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..?
మాస్ జాతర సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. చూస్తే ఇది పక్కా కమర్షియల్ సినిమా అని తెలుస్తుంది. (Maas Jathara)
 
                            Maas Jathara
Maas Jathara : మాస్ మహారాజ రవితేజ మాస్ జాతర సినిమాతో నవంబర్ 1న రానున్నాడు. నేడు రాత్రి నుంచే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేయనున్నారు. రవితేజ గత నాలుగు సినిమాలు నిరాశ పరచడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో, హిట్ కొడతాడా అని ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు.(Maas Jathara)
ఇప్పటివరకు మాస్ జాతర సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. చూస్తే ఇది పక్కా కమర్షియల్ సినిమా అని తెలుస్తుంది. రవితేజ గత సినిమాలు ఫ్లాప్ అయినా మాస్ జాతర సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమాకు దాదాపు 25 కోట్ల వరకు థియేటరికల్ బిజినెస్ జరిగిందని సమాచారం.
Also Read : Peter Teaser : ‘పీటర్’ టీజర్ రిలీజ్.. కేరళ బ్యాక్ డ్రాప్ లో భయపెట్టేలా ఉందిగా..
నైజాంలో 8 కోట్లకు, ఆంధ్రలో 10 కోట్లకు, సీడెడ్ 3 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 4 కోట్ల వరకు మాస్ జాతర రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఈ లెక్కన మాస్ జాతర సినిమాకు 25 కోట్ల బిజినెస్ జరిగిందంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 26 కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ 52 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మాస్ జాతర సినిమా ఈజీగా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రవితేజ కెరీర్ లో హిట్ తెస్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






