Bromance : ‘బ్రొమాన్స్’ మూవీ రివ్యూ.. మిస్ అయిన అన్న కోసం తమ్ముడు ఏం చేసాడు.. నవ్వుకోవాల్సిందే..

మలయాళంలో రిలీజయి మంచి విజయం సాధించిన చిన్న సినిమా బ్రొమాన్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

Mathew Thomas Mahima Nambiar Sangeeth Prathap Bromance Movie Review and Rating

Bromance Movie Review : ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు డబ్బింగ్ తో ఓటీటీలో, థియేటర్స్ లో ఇక్కడ కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. మలయాళంలో ఫిబ్రవరి 14న రిలీజయి మంచి విజయం సాధించిన చిన్న సినిమా బ్రొమాన్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సోనీ లివ్ ఓటీటీలో మే 1న రిలీజ్ అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్, మ్యాథ్యు థామస్, శ్యామ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అరుణ్ డి జోస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. షింటో(శ్యామ్ మోహన్), బింటో(మ్యాథ్యు థామస్) అన్నదమ్ములు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. షింటో కొచ్చిలో ఉండి జాబ్ చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. బింటో న్యూఇయర్ సందర్భంగా కూర్గ్ లో పార్టీ చేసుకోడానికి ఫ్రెండ్స్ తో వెళ్తాడు. బింటో కూర్గ్ లో పార్టీలో ఉన్నప్పుడు షింటో ఫ్రెండ్ షబ్బీర్(అర్జున్ అశోకన్) కాల్ చేసి షింటో కనపడట్లేదు అర్జెంట్ గా కొచ్చి రమ్మంటాడు.

దాంతో బింటో కొచ్చికి వెళ్తే ముందు రోజు బింటో తనను ఐశ్వర్య అనే ఒక అమ్మాయి మోసం చేసిందని ఏడ్చి వెళ్లిపోయాడని చెప్తాడు షబీర్. దీంతో బింటో వెళ్లి ఐశ్వర్య(మహిమ నంబియార్)తో గొడవ పడతాడు. షింటోని కనిపెట్టడానికి హరిహరసుధన్(సంగీత్ ప్రతాప్) అనే హ్యాకర్ హెల్ప్ తీసుకుంటాడు బింటో. ఈ క్రమంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. షింటోని వెతకడానికి ఐశ్వర్య కూడా బింటో, షబీర్, హరిహరసుధన్ తో కలుస్తుంది. అసలు షింటో ఏమైపోయాడు? షింటో – ఐశ్వర్యల కథ ఏంటి? ఐశ్వర్య ఎందుకు షింటోని వెతకడానికి వీళ్ళతో కలుస్తుంది? పోలీసులు ఏం చేస్తారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Seethamma Vakitlo Sirimalle Chettu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ సీన్ కోసం.. సంవత్సరం ముందే భద్రాచలం వెళ్లి..

సినిమా విశ్లేషణ.. ఓ అన్నయ్య కనిపించకుండా పోతే అతని తమ్ముడు అన్నయ్యని కనుక్కోవడానికి ఏం చేసాడు? ఎలా కనుక్కున్నాడు అనే ప్రయాణాన్ని కామెడీగా అక్కడక్కడా ఎమోషనల్ గా చూపించారు. షింటోని వెతికే ప్రయత్నంలో అందరూ చేసే ప్రయాణం, వాళ్ళు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఓ పక్కన సస్పెన్స్ గా సాగుతూనే మరోపక్క నవ్వించారు.

వాళ్ళ అన్నయ్య ఎక్కడ మిస్ అయ్యాడు అని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. అక్కడక్కడా ట్విస్ట్ లు కూడా మెప్పిస్తాయి. కొన్ని చోట్ల ల్యాగ్ ఉన్నా సినిమా ఫుల్ గానే నవ్విస్తుంది. సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా సీక్వెల్ కి లీడ్ ఇచ్చేలాగా క్లైమాక్స్ వదిలేసారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయచ్చు ఈ బ్రొమాన్స్ సినిమాని.

నటీనటుల పర్ఫార్మెన్స్.. తమ్ముడు బింటో పాత్రలో మ్యాథ్యు థామస్ ఫుల్ గా నవ్విస్తూనే అక్కడక్కడా ఎమోషన్ పండిస్తాడు. షింటో పాత్రలో శ్యామ్ మోహన్ కాసేపే కనపడినా బాగానే నటించాడు. హ్యాకర్ పాత్రలో సంగీత్ ప్రతాప్ కూడా బాగా నవ్విస్తాడు. మహిమ నంబియార్ తన నటనతో మెప్పిస్తుంది. అర్జున్ అశోకన్ కూడా అక్కడక్కడా నవ్విస్తాడు. షాజోన్, భరత్ బోపన్న, బిను పప్పు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Retro : సూర్య ‘రెట్రో’ మూవీ రివ్యూ.. 90s బ్యాక్ డ్రాప్ తో..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. కామెడీ పంచెస్ కి పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ బాగా కుదిరాయి. అరుణ్ ఈ సినిమాని మంచి కామెడీ సస్పెన్స్ సినిమాగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ అవుట్ పుట్ ఇచ్చారు.

మొత్తంగా ‘బ్రొమాన్స్’ సినిమా కనపడకుండా పోయిన అన్నయ్యను వెతికే ప్రయాణంలో తమ్ముడు, మరికొంతమంది కలిసి చేసే నవ్వుల హంగామా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.