Seethamma Vakitlo Sirimalle Chettu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ సీన్ కోసం.. సంవత్సరం ముందే భద్రాచలం వెళ్లి..
ఇంటర్వ్యూలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని ఓ సీన్ గురించి మాట్లాడారు శ్రీకాంత్ అడ్డాల.

Srikanth Addala Comments on Seethamma Vakitlo Sirimalle Chettu Climax Scene
Seethamma Vakitlo Sirimalle Chettu : మహేష్ బాబు – వెంకటేష్ ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఒక మంచి క్లాసిక్ సినిమాలా నిలిచింది. ఇటీవల ఆ సినిమా రీ రిలీజ్ అయి కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని ఓ సీన్ గురించి మాట్లాడారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా క్లైమాక్స్ లో అందరూ రాములోరి కళ్యాణంకు భద్రాచలం వెళ్లినట్టు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ పేలి గందరగోళం నెలకొనడం సీన్స్ ఉంటాయి. అయితే ఆ సీన్స్ భద్రాచలంలో తీయలేదట.
ఆ సీన్స్ గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లైమాక్స్ సీన్ కోసం సంవత్సరం ముందు భద్రాచలం కళ్యాణంకు వెళ్లి అక్కడ ఫుటేజ్ మొత్తం షూట్ చేసుకొని వచ్చాము. అది చూసి రామోజీ ఫిలింసిటీలో అచ్చం అలాగే సెట్ వేసాం. భద్రాచలం నుంచి పంతులు గార్లను, అక్కడి కొంతమంది జనాలని తీసుకొచ్చి సెట్ లో 12 రోజులు షూట్ చేసాము అని తెలిపారు.
అలాగే.. దిల్ రాజు గారు ఓ రోజు పిలిచి కార్ లో తీసుకెళ్తూ ఈ సినిమా కథని మహేష్ బాబుకు చెప్పమన్నారు. డైరెక్ట్ దూకుడు సినిమా షూటింగ్ సెట్ కి తీసుకెళ్లారు. అక్కడ మహేష్ బాబుకి కథ చెప్పగానే ఓకే అన్నారని తెలిపారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు రజినీకాంత్ ని అనుకుంటే దిల్ రాజు ఆశ్చర్యపోయి ఒప్పుకోరు, వద్దన్నారు. కానీ ట్రై చేసి వెళ్లి కథ చెప్పాము. ఆయనకు కథ నచ్చినా డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయలేదు అని తెలిపాడు శ్రీకాంత్ అడ్డాల.
Also Read : Upasana – Surekha : కొత్త ఆవకాయ పచ్చడి పెట్టి పూజ చేసిన మెగా అత్తాకోడళ్లు.. ఉపాసన సురేఖ వీడియో వైరల్..