Upasana – Surekha : కొత్త ఆవకాయ పచ్చడి పెట్టి పూజ చేసిన మెగా అత్తాకోడళ్లు.. ఉపాసన సురేఖ వీడియో వైరల్..
చిరంజీవి భార్య సురేఖ మెగా కుటుంబానికి సరిపడా కొత్త ఆవకాయ పెట్టేసారు.

Chiranjeevi Wife Surekha Ram Charan Wife Upasana Prepare Summer Special Avakaya Pickle from athammas kitchen
Upasana – Surekha : రామ్ చరణ్ భార్య ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫ్యామిలీ గురించి కూడా ఏదో ఒక ఫోటో, వీడియో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి అత్తమ్మస్ కిచెన్ అని ఓ ఇన్‌స్టంట్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి కూడా సపరేట్ సోషల్ మీడియా పేజీ పెట్టి ఆ బిజినెస్ కి సంబంధించినవి, అత్తాకోడళ్లు చేసే ఫుడ్ గురించి అప్పుడప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు సమ్మర్ సీజన్. అంటే స్పెషల్ గా ఆవకాయ సీజన్. ప్రతి కుటుంబం సమ్మర్లో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకోవాల్సిందే. ఆవకాయతో అన్నం తినాల్సిందే. అందుకు మెగా ఫ్యామిలీ ఏం తక్కువ కాదు. చిరంజీవి భార్య సురేఖ మెగా కుటుంబానికి సరిపడా కొత్త ఆవకాయ పెట్టేసారు. కొంతమంది ఆవకాయ పచ్చడి తయారయ్యాక లక్ష్మి దేవి పూజ చేసి అప్పుడు తింటారు. అలాగే సురేఖ, ఉపాసన కూడా ఆ ఆవకాయ పచ్చడిని పూజ మందిరంలో పెట్టి లక్ష్మి దేవి పూజ చేసారు.
Also See : Pooja Hegde : ‘రెట్రో’ సినిమా నుంచి పూజా హెగ్డే వర్కింగ్ స్టిల్స్..
అత్తాకోడలు ఇద్దరూ పూజ చేసిన వీడియోని అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ సీజన్ మా అత్తమ్మ ఆవకాయ పచ్చడి పెట్టింది అంటూ తెలిపింది. ఇంట్లోకే కాకుండా అత్తమ్మస్ కిచెన్ లో అమ్మడానికి కూడా కలిపి ఈ పచ్చడి పెట్టించినట్టున్నారు. కొత్త పచ్చడి కావాలంటే ఆర్డర్ చేసుకోండి అని కూడా పోస్ట్ చేసారు. దీంతో ఈ మెగా అత్తాకోడళ్ల ఆవకాయ పచ్చడి వీడియో వైరల్ గా మారింది.
Also See : Actress Purnaa Son : దుబాయ్ లో గ్రాండ్ గా నటి పూర్ణ కొడుకు పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?