Allu Arjun : యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అప్పుడు అర్థమైంది.. వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..

తాజాగా అల్లు అర్జున్ ముంబైలో నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఆ స్టేజిపై అల్లు అర్జున్ ని ఇంటర్వ్యూ చేయగా పలు అంశాల గురించి మాట్లాడాడు.

Allu Arjun : యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అప్పుడు అర్థమైంది.. వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..

Allu Arjun Comments on his Accident and Fitness in Waves Summit

Updated On : May 1, 2025 / 8:30 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. త్వరలో అల్లు అర్జున్ – అట్లీ సినిమా మొదలు కానుంది. తాజాగా అల్లు అర్జున్ ముంబైలో నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఆ స్టేజిపై అల్లు అర్జున్ ని ఇంటర్వ్యూ చేయగా పలు అంశాల గురించి మాట్లాడాడు.

Also Read : Upasana – Surekha : కొత్త ఆవకాయ పచ్చడి పెట్టి పూజ చేసిన మెగా అత్తాకోడళ్లు.. ఉపాసన సురేఖ వీడియో వైరల్..

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. యాక్టర్స్ కి ఫిట్నెస్ చాలా అవసరం. ఎప్పుడు డ్యాన్స్, ఫైట్ ఉంటుందో తెలీదు. ముందే మన బాడీని ప్రిపేర్ గా పెట్టుకోవాలి. నా 10వ సినిమా షూటింగ్ తర్వాత నాకు యాక్సిడెంట్‌ జరిగింది. అప్పుడు నా భుజం బాగా గాయపడింది. అంతకుముందు చిన్న సర్జరీ అయింది. మూడు వారాలు రెస్ట్ తీసుకొని నాలుగో వారం జిమ్ కి వెళ్ళిపోయాను. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను. ఆస్ట్రేలియాలో జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. నేను అస్సలు ఊహించలేదు. కానీ రెండు మూడు నెలల్లో నా నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలి. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అప్పుడు నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలిసింది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ స్ట్రెంత్ తగ్గుతుంది. నా 11వ సినిమా నుంచి యాక్టింగ్ మీద, ఫిట్నెస్ మీద, ప్రతి సీన్ మీద మరింత ఫోకస్ చేసాను అని తెలిపాడు.

Also See : Siri Hanumanth : బాబోయ్.. వెకేషన్ నుంచి హాట్ ఫోటోలు షేర్ చేసిన సిరి హన్మంత్..