Ram Charan – Isha Yadav : రామ్ చరణ్ సర్‌కి పెళ్లిఅయిపోయిందని బాధపడ్డా.. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా ఇవ్వమని రిక్వెస్ట్ చేశా..

తాజాగా రియా ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపింది. ఈ క్రమంలో తనకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో తెలిపింది.

Mathu Vadalara 2 Fame Riya Aliyas Isha Yadav Interesting Comments on Ram Charan

Ram Charan – Isha Yadav : ఇటీవల మత్తు వదలరా 2 సినిమాలో రియా పాత్రలో మెప్పించింది ఇషా యాదవ్. సోషల్ మీడియాలో రియా ఎవరు అంటూ బాగా వైరల్ అయి ఇషా యాదవ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేసిన ఇషా యాదవ్ కి మత్తు వదలరా 2నే మొదటి సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమాతోనే అందరికి తెలిసేలా వైరల్ అయింది ఇషా యాదవ్.

Also See : Radhakrishnan Parthiban : పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ్ నటుడు, దర్శకుడు.. ఫొటోలు వైరల్..

తాజాగా ఇషా యాదవ్ ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపింది. ఈ క్రమంలో తనకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో తెలిపింది.

ఇషా యాదవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు రామ్ చరణ్ సర్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన్ని లవ్ చేశాను. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు బెట్టింగ్ రాజా(హిందీలో రచ్చ సినిమా డబ్బింగ్ వర్షన్) సినిమాను టీవీలో చూసాను. అప్పట్నుంచి నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. ఆయనకు పెళ్లి అయిందని తెలిసి బాధపడ్డాను. రీసెంట్ గా ఆయనకు బేబీ కూడా పుట్టిందని తెలిసి ఇంకా ఎక్కువ బాధపడ్డాను. నేను మత్తు వదలరా 2 సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ప్రొడ్యూసర్ చెర్రీ సర్ ని రామ్ చరణ్ సినిమాల్లో ఏదైనా ఒక రోల్, చిన్నది అయినా పర్లేదు చరణ్ సర్ సినిమాలో రోల్ ఉంటే చెప్పండి చేస్తాను అని రిక్వెస్ట్ చేసుకున్నాను అని తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. నార్త్ లో కూడా చరణ్ కి అమ్మాయిల్లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఇషా యాదవ్ ని మరింత వైరల్ చేస్తున్నారు.