Venkatesh : వెంకటేష్ సరసన గుంటూరు కారం భామ.. అనిల్ రావిపూడి సినిమా కోసం..? మరి ఇంకో హీరోయిన్ ఎవరు?

టీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసారు.

Venkatesh : వెంకటేష్ సరసన గుంటూరు కారం భామ.. అనిల్ రావిపూడి సినిమా కోసం..? మరి ఇంకో హీరోయిన్ ఎవరు?

Meenaakshi Chaudhary will pair up to Venkatesh in Anil Ravipudi Movie

Updated On : April 15, 2024 / 12:23 PM IST

Venkatesh : ఈ సంవత్సరం సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వచ్చిన వెంకటేష్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కూడా రాబోతున్నాడు. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీసాఫీసర్ అని, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక భార్య ఉంటుందని సినిమా అనౌన్స్ చేస్తూ తెలిపారు.

దీంతో మరోసారి అనిల్ – వెంకటేష్ కలిసి నవ్వించబోతున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenaakshi Chaudhary) నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుంటూరు కారంతో సక్సెస్ కొట్టిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పటికే నాలుగు తెలుగు సినిమాలు మీనాక్షి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షికి వెంకటేష్ సరసన ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకుందట. ఇక ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ సమాచారం.

Also Read : Rashmika Mandanna : ఆ ఫ్లాప్ సినిమానే నాకు ఇష్టం.. రష్మిక వ్యాఖ్యలు.. పుష్ప 2 గురించి కూడా ఏం చెప్పిందంటే..

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. ఒకరు వెంకటేష్ భార్య పాత్రలో, మరొకరు మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించనున్నారు. ఒక హీరోయిన్ గా మీనాక్షిని తీసుకుంటే మరి వెంకీమామ సరసన నటించే ఇంకో భామ ఎవరో తెలియాలి.