Gunturu Kaaram : మహేశ్‌తో రొమాన్స్ చేయనున్న మీనాక్షి చౌదరి..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం(Gunturu Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Mahesh Babu-Meenakshi Chaudhary
Gunturu Kaaram-Meenakshi chaudhary : సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం'(Gunturu Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. డేట్ క్లాష్ ల వల్ల ఈ సినిమా నుంచి పూజా హెగ్డే(Pooja Hegde) తప్పుకుంది. దీంతో సినిమా బృందం హీరోయిన్ వేట మొదలుపెట్టింది. శ్రీలీల(Sreeleela) ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇక.. పూజా స్థానంలో విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్(Meenakshi Chaudhary)ను తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే.. తాజాగా సంయుక్త కూడా కాదని, మీనాక్షి చౌదరిని ఎంచుకున్నారని ఓ నెట్టింట ఓ వార్త షికారు కొడుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. కాగా.. ఇందులో ఎంత నిజం ఉందని చిత్ర బృందం స్పందించే వరకు తెలీదు.
మీనాక్షి చౌదరి.. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత రవితేజ సరసన ‘ఖిలాడీ’ చిత్రంలోనూ నటించింది. అయితే.. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ‘హిట్-2’ సినిమాతో ప్రేక్షకుల ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్స్‌లతో యువత హృదయాలను కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే మహేశ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.