Meera Mitun: లొంగితేనే ఇతర రాష్ట్రాలవారికి సినీ అవకాశాలు
బిగ్ బాస్ కంటెస్టెంట్, తమిళ నటి మీరా మిథున్ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారుతున్న మీరా మిథున్ ఈ మధ్యనే ఓ సామాజికవర్గం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులు తెచ్చుకుంది.

Meera Mitun
Meera Mitun: బిగ్ బాస్ కంటెస్టెంట్, తమిళ నటి మీరా మిథున్ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారుతున్న మీరా మిథున్ ఈ మధ్యనే ఓ సామాజికవర్గం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులు తెచ్చుకుంది. ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాల వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ నుండి బయటకి వెళ్లిపోవాలని కామెంట్ చేసిన మీరా మిథున్ పై తమిళనాడులో వివిధ ప్రాంతాలలో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు మీరా ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేసింది.
అయితే, ఈ వివరణ వీడియోలో కూడా మరో వివాదాన్ని సృష్టించింది. సినీ ఇండస్ట్రీలో లొంగితేనే సినిమా అవకాశాలు వస్తాయని.. ఇతర రాష్ట్రాల వాళ్ళు మగవాళ్ళకి లొంగడం వలనే తమిళంలో అవకాశాలు వస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను తమిళ ఇండస్ట్రీలోనే వాళ్ళే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక గత వారం చేసిన వ్యాఖ్యల వివాదంపై స్పందించిన మీరా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారని.. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు బిడ్డగా తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని.. ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని సీఎం స్టాలిన్, పీఎం మోడీకి విజ్ఞప్తి చేశారు. తాను చేసిన ప్రతి వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి చూస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించిన మీరా..తనపై సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. ఇక, చివరగా ఎవరూ తనను అరెస్టు చేయలేరంటూ పోలీసులకు సవాల్ చేయడం విశేషం. మరి మీరా వ్యాఖ్యల పరంపర ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి!