Narappa: ఓటీటీలో నారప్ప.. డేట్ ఫిక్స్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల
మే 14న థియేట్రికల్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించినా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నారప్ప విడుదల కాలేదు.
Narappa: విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”నారప్ప”. ధనుష్ హీరోగా సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాని జులై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ముందుగా మే 14న థియేట్రికల్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించినా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కుదరలేదు. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకి ‘U/A’ సర్టిఫికేట్ ఇవ్వగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.
‘నారప్ప’ షూటింగ్ చాలావరకు అనంతపురంజిల్లాలో జరిగింది. వెంకటేష్ ‘నారప్ప’తో పాటు ‘దృశ్యం 2’ సినిమాను కంప్లీట్ చేసారు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే రానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ‘నారప్ప’ డైరెక్ట్‌గా ఓటీటీ లో విడుదలవుతోంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అసురన్ ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్గా చిత్రయూనిట్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించింది.
All my well-wishers and fans have been eagerly waiting to watch our film, #Narappa. Your love towards this film has been overwhelming for me and the team, who always ensured to go an extra mile just like Narappa. pic.twitter.com/5lEMa86pRb
— Venkatesh Daggubati (@VenkyMama) July 12, 2021