Balakrishna : బాలయ్య బాబుతో దిల్‌రాజ్, టాలీవుడ్ నిర్మాతల మీటింగ్..
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు.

Meeting of Dil Raju and Tollywood producers with Balayya Babu
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. ఇటు సినిమాల్లో అటు పాలిటిక్స్‌లోనూ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఇటీవల ఆయన నటించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించారు. సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండి కూడా బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సాయపడుతున్నారు.
కాగా.. బాలయ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో మూడోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బాలయ్యను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు.
Dev Gill : ‘మగధీర’ విలన్ దేవ్ హీరోగా పాన్ ఇండియా సినిమా.. ‘అహో విక్రమార్క’ టీజర్ రిలీజ్..
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, ఈసీ మెంబర్ వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), కార్యదర్శి దామోదర్ ప్రసాద్, కోశాధికారి ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపం రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవిలు బాలయ్యను కలిసి పుప్షగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.