Dev Gill : ‘మగధీర’ విలన్ దేవ్ హీరోగా పాన్ ఇండియా సినిమా.. ‘అహో విక్రమార్క’ టీజర్ రిలీజ్..

దేవ్ గిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'అహో విక్రమార్క'తో రాబోతున్నాడు.

Dev Gill : ‘మగధీర’ విలన్ దేవ్ హీరోగా పాన్ ఇండియా సినిమా.. ‘అహో విక్రమార్క’ టీజర్ రిలీజ్..

Magadheera Fame Dev Gill Pan India Movie Aho Vikramaarka Teaser Released

Updated On : June 20, 2024 / 12:38 PM IST

Dev Gill Aho Vikramaarka Teaser : బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ తెలుగులో మగధీర సినిమాలో విలన్ గా కనిపించి స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. మరో పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దేవ్ గిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా ‘అహో విక్రమార్క’తో రాబోతున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా తెలుగు టీజర్ ని రాజమౌళి విడుదల చేశారు.

Also Read : Mamitha Baiju : ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు చేసిన యాడ్ చూశారా?

అహో విక్రమార్క టీజర్ చూస్తుంటే.. ఓ ఏరియాలో విలన్స్ కొంతమందిని బానిసలుగా ఆచూస్తూ వారితో పనులు చేయిస్తూ ఉంటారు. దేవ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా టీజర్ చూసేయండి..

ఈ సినిమాలో తేజస్విని పండిట్, చిత్ర శుక్ల హీరోయిన్స్ గా నటిస్తుండగా పేట త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ అహో విక్రమార్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.