Mamitha Baiju : ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు చేసిన యాడ్ చూశారా?
మమిత బైజుకి ప్రేమలు సినిమాతో స్టార్ డమ్ రావడంతో పలు యాడ్స్ కూడా వస్తున్నాయి.

Watch Premalu Movie Fame Mamitha Baiju Advertisement
Mamitha Baiju : మమిత బైజు.. మలయాళ బ్యూటీ గతంలో పలు సినిమాలు చేసినా కేరళలో తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఇటీవల వచ్చిన ప్రేమలు సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. ఇటీవల మలయాళ మూవీ ప్రేమలు మలయాళంలో సూపర్ హిట్ అయి అనంతరం వేరే భాషల్లో కూడా డబ్బింగ్ అయి అన్ని చోట్ల హిట్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు సినిమా భారీ విజయం సాధించింది.
ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. యూత్ అంతా ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ్ లో కూడా మమిత బైజు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం మమిత బైజు స్టార్ హీరోయిన్ అయిపోయింది. వేరే భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటుంది.
మమిత బైజుకి ప్రేమలు సినిమాతో స్టార్ డమ్ రావడంతో పలు యాడ్స్ కూడా వస్తున్నాయి. లోకల్ మలయాళం యాడ్స్ తో పాటు నేషనల్ లెవల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల మంచ్ చాకోలెట్ కి మమిత బైజు యాడ్ చేసింది. ఈ యాడ్ వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది. మీరు కూడా మమిత బైజు చేసిన మంచ్ యాడ్ చూసేయండి..