Raviteja – Sunny Deol : రవితేజ చేయాల్సిన సినిమా బాలీవుడ్‌కి.. ఒక్క సినిమా కోసం కలిసిన రెండు అగ్ర తెలుగు నిర్మాణ సంస్థలు..

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమా ప్రకటించారు.

Raviteja – Sunny Deol : రవితేజ చేయాల్సిన సినిమా బాలీవుడ్‌కి.. ఒక్క సినిమా కోసం కలిసిన రెండు అగ్ర తెలుగు నిర్మాణ సంస్థలు..

Gopichand Malineni Drops Raviteja Movie and Announce with Sunny Deol under Two big Production Houses

Updated On : June 20, 2024 / 9:47 AM IST

Raviteja – Sunny Deol : రవితేజ – గోపీచంద్ మలినేని కాంబో సూపర్ హిట్ హ్యాట్రిక్ కాంబో. వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ప్రకటించారు. కానీ బడ్జెట్ పెరిగిపోయింది అని రవితేజ మార్కెట్ మీద అంత బడ్జెట్ సెట్ అవ్వదని ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదే కథని గోపీచంద్ బాలీవుడ్ లో సన్నీ డియోల్ కి చెప్పాడని, సన్నీ ఓకే చేసాడని ఇటీవల వార్తలు రాగా తాజాగా ఆ సినిమాని నేడు అధికారికంగా ప్రకటించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. ఈ సినిమాని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలుగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.

Also Read : Chiranjeevi : విశ్వంభర సెట్లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన మెగాస్టార్.. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తారని..

ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే రవితేజతో ఆగిపోయిన సినిమా కథ ఇదేనా కాదా అనేది మాత్రం అధికారికంగా చెప్పలేదు. టాలీవుడ్ సమాచారం ప్రకారం రవితేజతో ఆగిపోయిన సినిమా కథే ఇప్పుడు సన్నీ డియోల్ తో తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఇటీవలే గదర్ 2 సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.