Chiranjeevi : విశ్వంభర సెట్లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన మెగాస్టార్.. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తారని..
విశ్వంభర సెట్లో మినిష్టర్ కందుల దుర్గేష్ తో చిరంజీవి ముచ్చటించి సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడారు.

Megastar Chiranjeevi Meets AP Cinematography Minister Kandula Durgesh in Vishwambhara Sets
Chiranjeevi : ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులను కూడా ప్రకటించి వారికి శాఖలను అప్పగించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖను జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు కేటాయించారు. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేష్ విశ్వంభర షూటింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి ఆయనకు స్వాగతం చెప్పి సన్మానించారు.
విశ్వంభర సెట్లో మినిష్టర్ కందుల దుర్గేష్ తో చిరంజీవి ముచ్చటించి సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ కూడా కందుల దుర్గేష్ సన్మానంలో పాల్గొంది. తాజాగా చిరంజీవి కందుల దుర్గేష్ ని సన్మానించి, ఆయనతో మాట్లాడిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చిరంజీవి ఈ ఫొటోలు షేర్ చేస్తూ.. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది.
మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!??… pic.twitter.com/R7tDsrPR6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024